మాతా, శిశు మరణాల కట్టడికి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైరిస్క్ గర్భిణులను ప్రసవానికి 3, 4 రోజుల ముందే ఏరియా, జిల్లా, బోధనాస్పత్రులకు తరలించి వారికి మెరుగైన ఆరోగ్య రక్షణ కల్పించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ పర్యవేక్షణకు ప్రత్యేకంగా యాప్ రూపొందించనుంది. హైరిస్క్ గర్భిణులను పెద్దాస్పత్రులకు తరలించేందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించనుంది. ఇందుకోసం నెలకు రూ.కోటి చొప్పున ఏడాదికి రూ.12 కోట్ల వరకు ఖర్చవుతుందని వైద్యశాఖ అంచనా వేసింది.