ఏపీ ఎన్నికల ప్రచారం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తయారు చేయించుకున్న 'వారాహి' రిజిస్ట్రేషన్ వాయిదా పడినట్లు సమాచారం. దీని రిజిస్ట్రేషన్ కు తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖ అనుమతివ్వనట్లు తెలుస్తోంది. లారీ ఛాసిస్ ను బస్సుగా మార్చడం, వాహనం ఎత్తు ఎక్కువగా ఉండటం, గనుల్లో వాడే వాహనాల టైర్లను రోడ్లపై వాడటం, ఆర్మీ వాహనాలకు సంబంధించిన రంగును సివిల్ వాహనాలకు వేయడం వంటి కారణాలతో రిజస్ట్రేషన్ కు అనుమతి ఇవ్వలేదట. అయితే తాము సూచించిన మార్పులు చేస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని వెల్లడించిందట.