టాటాల వశమైన విమాన సర్వీసుల దిగ్గజం ఎయిరిండియా భారీ సంఖ్యలో విమానాల కొనుగోలుకు సిద్ధమైంది. తన సేవలను మరింత విస్తృతం చేసే కార్యాచరణలో భాగంగా సుమారు 500 జెట్ లైనర్ విమానాలను కొనుగోలు చేయాలని ఎయిరిండియా భావిస్తోంది. ఈ విమానాలను బోయింగ్, ఎయిర్ బస్ సంస్థల నుంచి కొనుగోలు చేయనుంది. అందుకోసం రూ.80 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మహా కొనుగోలు ఒప్పందం త్వరలోనే కార్యరూపం దాల్చనుందని విమానయాన రంగం వర్గాలు తెలిపాయి. దీనిపై ఎయిరిండియా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.