కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటలో సోమవారం "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమం లో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ పాల్గొన్నారు. మంత్రి ప్రతి గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తూ పథకాల అమలుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.