ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధి పని చేపట్టకపోగా సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 12, 2022, 01:04 PM

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి ఆదేశాలతో నిర్వహిస్తున్న ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని గ్రామగ్రామాన నిర్వహించాలని  కనిగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. కనిగిరి మండలంలోని తలకొండపాడులో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....  నాయకులు, కార్యకర్తలు సమన్వయం చేసుకుని ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచక పాలనను ప్రజలకు వివరించాలన్నారు. వైసీపీ అధికారం చేపట్టిన ఈ మూడున్నరేళ్లలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క అభివృద్ధి పని చేపట్టకపోగా సామాన్య ప్రజల నడ్డి విరిచేలా నూనె, ఉప్పు, పప్పులు, గ్యాస్‌, విద్యుత్‌చార్జీలను పెంచిందని విమర్శించారు. ఈ ప్రాంత బీడు భూములు సాగులోకి తెచ్చేందుకు తాను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు పాలేటిపల్లి ప్రాజెక్టును నిర్మించానన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com