ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన లక్ష్మీనర్సుపేటకు చెందిన పట్టపు మల్లేశ్వరరావు (32) శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే...... మల్లేశ్వరరావు మద్యానికి బానిసై భార్యతో నిత్యం గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో తన కన్నవారింటికి వెళ్లిపోతానని భార్య అనడంతో మనస్తాపానికి గురైన మల్లేశ్వరరావు శనివారం మధ్యాహ్నం ఇంటిలో ఉన్న పేలుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మల్లేశ్వరరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.