వివాహేతర సంబంధమే చిత్తూరులో ఒక వ్యక్తి హత్యకు కారణమైంది. ఈ కేసులో అతని భార్యతో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కత్తులు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళ్ళితే .. చిత్తూరు నగరం గిరింపేట బాలాజీ నగర్‌కు చెందిన వడివేలును నెల 5వ తేదీన కొందరు గొంతుకోసి హతమార్చారు. సీతమ్స్ కళాశాల ఎదరుగా ఉన్న కోడిగుట్ట రోడ్డులో మృతదేహం పడుంది. మృతుడి తల్లి రాణెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు సందేహపడినట్లుగానే విచారణలో తేలాయి. మృతుడి భార్య శెల్విరాణికి, స్వామిమేస్ర్తీవీధిలోని వినయ్‌తో వివాహేతర సంబంధం ఉంది. కొంత కాలంగా తనకు పెళ్లికాలేదని చెబుతూ అతడిని ఆమె బుకాయించింది. ఆమెకు పెళ్లయిందని వినయ్ తెలుసుకునేలోపు వారి సంబంధం పీకల్లోతుకు కూరుకుపోయింది. దాంతో ఎలాగైన శెల్విరాణి భర్త వడివేలును హతమార్చాలని నిర్ణయించాడు. ఈ విషయాన్ని ఆమెకూ చెప్పగా, సరేనంది. సంతపేట సున్నపువీధికి చెందిన నిరంజన్, కృష్ణానగర్‌కు చెందిన కిరాయి హంతకుడు కిశోర్‌తో వినయ్ మాట్లాడాడు. అందరూ కలిసి వడివేలు హత్యకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 5వ తేదీన అతడిని ఆటోలో ఎక్కించుకుని సీతమ్స్ కళాశాల ఎదురుగా ఉన్న కోడిగుట్ట రోడ్డు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు. ఆ తరువాత వడివేలును గొంతుకోసి హతమార్చారు. పోలీసుల విచారణలో ముగ్గురు నిందితులు నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడానికి సహకరించిన మృతుడి భార్య శెల్విరాణిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్య జరిగిన వారం రోజుల్లోపే కేసును ఛేదించిన సీఐ, ఎస్‌ఐతో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.