కనీసం నోటీసులు ఇవ్వకుండా ఆరామక్షేత్రం వద్ద ఉన్నబీసీలకు చెందిన కాంప్లెక్స్‌ను ప్రభుత్వ అధికారులు అత్యుత్సాహంతో కూల్చివేయడాన్ని విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పొన్నుపల్లి బ్రహ్మనందం, చెన్నుపల్లి శ్రీనివాసాచారి విమర్శించారు. స్థానిక సామంతపూడి అడితిలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడారు. నోటీసు ఇచ్చిన 12 గంటల్లో నిర్మాణం కూల్చివేశారన్నారు. కనీసం అధికా రులు భాద్యతారాహితంగా వ్యవహరించ లేదన్నారు. కూల్చివేతలకు సంబంధించిన రూ.కోటి ఆస్తి నష్టాన్ని ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా రెవెన్యూ, నగరపంచాయతీ అధికారులను సస్పెండ్ చేయాల న్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్, మన్సిపల్ కార్యాలయాల వద్ద త్వరలో ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు కూడగడతామన్నారు. అనంతరం కూలగొట్టిన ఆరామక్షేత్రాన్ని పరిశీలించారు.