గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 19న పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ మేరకు రేగిడి గ్రామంలో ఆదివాసీ నాయకులు ఆదివారం పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..... బెంతు ఒరియాలను ఆదివాసీలుగా మార్చవద్దని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలోనే ఏకలవ్య పాఠశాలలు, కస్తూర్బా పాఠ శాలల్లో ఉద్యోగులుగా గిరిజనులను నియమించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబరు 3ను కొట్టివేసిన నేపథ్యంలో దీని స్థానంలో కొత్త జీవోను తీసుకురావాలన్నారు. తాము నిర్వహిస్తున్న ర్యాలీని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జిల్లా కార్యదర్శి పువ్వల సత్యనారాయణ, గిరిజన నాయకులు పాల్గొన్నారు.