విశాఖపట్నమే పరిపాలనా రాజధాని అని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధమైందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే విశాఖను రాజధానిగా చేస్తున్నామని.. శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. భోగాపురం విమానాశ్రయం పనులకు జనవరిలో శంకుస్థాపన జరుగనుందని తెలిపారు. కొందరు ఎమ్మెల్యేలు కార్యకర్తల ఫోన్లకూ అందుబాటులో ఉండడం లేదని.. ఇలాగైతే పార్టీకి నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు నోరువిప్పితే అబద్ధాలే మాట్లాడుతున్నారని, తన హయాంలో ఏమి చేయలేని కారణంగానే ఆయన్ను ప్రజలు తిరస్కరించారని చెప్పారు.