నెల్లూరు జిల్లాలో తుఫానుప్రభావంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా తీశారు. కలెక్టర్ చక్రధర్ బాబుతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెంకయ్యకు కలెక్టర్ వివరించారు. ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాల్సిందిగా కలెక్టర్కు వెంకయ్యనాయుడు సూచించారు.