ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతీ కార్యకర్తకు న్యాయం జరుగుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 12, 2022, 04:05 PM

మూడున్నర సంవత్సరాల పాలనలోనే మేనిఫెస్టోలోని వాగ్దానాలను 98 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదని, కరోనా కష్టకాలంలోనూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారని వైయస్‌ఆర్‌ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పేదల సంతోషాన్ని చూసి ఓర్వలేక ప్రభుత్వంపై నిత్యం బురదజల్లుతున్న చంద్రబాబు, ఎల్లో మీడియా కుట్రలను తిప్పికొట్టాలని, వైయస్‌ జగన్‌ ప్రభుత్వ సంక్షేమ పాలనను ప్రతీ గడపకూ వివరించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అనంతపురం నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి, ఉషాశ్రీచరణ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com