ఏపీలోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి విద్యార్థుల ఇంటి వద్దకే అధికారులు వచ్చి ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను అందజేయనున్నట్లు తెలిపింది. దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఉచితంగానే సర్టిఫికెట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. విద్యార్థుల జాబితాను వీఆర్వోల మొబైల్ యాప్ కు అనుసంధానం చేశారు. వీఆర్వోలు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అర్హత, సామాజిక పరిస్థితి ఆధారంగా ఆర్ఐకి నివేదిక ఇస్తారు. ఆర్ఐ పరిశీలన చేసి తహసీల్దార్ కు సిఫార్సు చేస్తారు. తహసీల్దార్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. వాటిని వాలంటీర్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అందజేస్తారు.