ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని పొందూరు మండల రెవెన్యూ అధికారికి, పొందూరు మండల బిజెపి నాయకులు, బిజెపి మండల అధ్యక్షుడు లోలుగు సింహాచలం అధ్వర్యంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ధాన్యంతో పాటు మొక్కజొన్న పంటను కూడా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరారు. శ్రీకాకుళం మండలంలో ఏ రైతుకు ఇబ్బంది కలగకుండా, నష్టం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని బిజెపి ఇ-లైబ్రరీ రాష్ట్ర కన్వీనరు చల్లా వెంకటేశ్వర రావు కోరారు.
శ్రీకాకుళం మండల ప్రవాస్ యోజన కార్యక్రమానికి ఇంఛార్జ్ గా పాల్గొన్న చల్లా వెంకటేశ్వర రావు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పేరూరి శ్రీనివాస రావు, మజ్జి కృష్ణంనాయుడు, బలివాడ సత్యనారాయణ, జామాన లక్ష్మీనారాయణ, గురజాపు గౌరు నాయుడు తదితరులు పాల్గొన్నారు.