బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ కోరితే ఆలోచిస్తామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఒకవేళ అలాంటి ప్రతిపాదన ఏదైనా ఉంటే సీఎం జగన్ అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రాజకీయ పార్టీగా ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చని పేర్కొన్నారు. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదే అని అభిప్రాయపడ్డారు. అయితే, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే ఆలోచన వైసీపీకి లేదని సజ్జల స్పష్టం చేశారు. విభజన హామీలపై తాము పోరాటం చేస్తూనే ఉన్నామని వెల్లడించారు.