కర్ణాటకలో మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి త్వరలోనే కొత్త పార్టీ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పేరుతో పార్టీ ప్రారంభానికి అన్ని సిద్ధం చేసుకొన్నారని, పార్టీ పేరును ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించుకొనేందుకు ఢిల్లీ వెళ్లనున్నారంటూ ప్రచారం సాగుతోంది. కర్ణాటక బీజేపీలో ఓ వెలుగు వెలిగిన గాలి జనార్ధన్‌రెడ్డి కొత్త పార్టీ పెడితే తమ పుట్టి మునగడం ఖాయమని బీజేపీ నేతలు అంటున్నారు. దాదాపు 20 నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని చెబుతున్నారు.