శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ పెరిగింది. కేరళలోని పంపా నది నుంచి శబరిమల ఆలయం వరకూ ఇసుకేస్తే రాలనంతగా భక్తులతో నిండిపోయింది. సోమవారం ఒక్కరోజే 1.20 లక్షల మంది అయ్యప్పను దర్శించుకున్నారు. ఈ క్రమంలో గరిష్టంగా రోజుకు 90 వేల మంది భక్తులకు స్వామి దర్శనం కల్పించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. దర్శన వేళలను కూడా గంట పొడిగించాలని.. వాహన పార్కింగ్ సదుపాయాలను కూడా పెంచాలని సీఎం ఆదేశించారు. మరోవైపు వర్షం, చలితో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వారికి బిస్కెట్లు, మంచినీళ్లు అందించాలని హైకోర్టు ఆదేశించింది.