బీహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని బేతీయాలో అమానవీయ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన శైలేంద్ర కుమార్ అనే యువకుడు 14 ఏళ్ల యువతిపై శుక్రవారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు తల్లికి విషయం చెప్పింది. అయితే కొంతమంది పంచాయతీ పెద్దలు రూ.2 లక్షలు ఇస్తామని పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని కోరారు. ఈ తతంగంపై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.