నాగాయలంక మండలంలో వరి పంట పూర్తిగా నేలకొరిగింది. తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు 1061 రకం పంట వేసిన రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొన్నిచోట్ల వరి పనుల మీద ఉండగా, మరి కొన్ని చోట్ల వరి పంట పూర్తిగా నేలకొరిగి వర్షపు నీళ్లలో నానుతుంది. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు స్పందించి రైతును ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.