30 ఆంధ్ర బెటాలియన్, ఎన్ సి సి నగర్, కడపను సోమవారం ఉదయం 11వ కంబైన్డ్ వార్షిక శిక్షణా శిబిరం ప్రారంభ ఉపన్యాసం లో క్రమశిక్షణ, సమయపాలన, నాయకత్వ లక్షణాలు ఎన్ సి సి శిక్షణ తో సాధ్యం అని క్యాంపు కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ విభోర్ గుప్తా తమ ప్రారంభ ఉపన్యాసంలో తెలిపారు.
కడప, అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు మరియు సత్యసాయి జిల్లాలనుండీ 530 మంది కేడెట్లు ఈ క్యాంపులో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపు అడ్జుటెంట్ లెఫ్టినెంట్ ఆర్. నీలయ్య, లెఫ్టినెంట్ టి. వెంకటరమణ, లెఫ్టినెంట్ బి. మహేష్, లెఫ్టినెంట్ అశోక్ కుమార్, టివో పి. రాజశేఖర్, సుభేదార్ మేజర్ సుఖేందర్ సింగ్, ఈశ్వర్ రెడ్డి, జగదీష్, ఎస్ ఎస్ రావు, ఆఫీసు సిబ్బంది సరస్వతి, డేవిడ్, ఉమ, ప్రియ, రాజగోపాల్ రెడ్డి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.