కరోనా స్థాయిలో ‘మెర్స్’గా పిలిచే మరో వైరస్ విజృంభిస్తున్నట్లు డబ్ల్యూ హెచ్ వో హెచ్చరిస్తోంది. సౌదీ అరేబియాలో పుట్టిన ఈ వైరస్ ఒంటెల నుంచి మనుషులకు వ్యాపిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో ఖతార్ లోని ఫుట్ బాల్ చూసేందుకు వెళ్లిన వారు ఒంటెలకు దూరంగా ఉండాలని ఆస్ట్రేలియా సూచించింది. బ్రిటన్ సైతం జ్వర పీడితులపై అప్రమత్తమైంది. బాధితులకు వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందిస్తోంది. అమెరికాలో ఇటీవల శ్వాసకోస సంబంధిత కేసులు పెరుగుతున్నట్లు డబ్ల్యూహెచ్ వో నివేదించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.