రోజురోజుకి సమాజంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని చెప్పాలి. తాజాగా మీకు లాటరీలో రూ.8.60లక్షల విలువైన గిఫ్టు వచ్చింది అని ఒంగోలు వెంకటేశ్వర కాలనీకి చెందిన చావ చెంగయ్యకు మెసేజ్ వచ్చింది. అందుకు జీఎస్టీ రూ.61,500 ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి చేయించుకున్నారు. అనంతరం ఆ ఫోన్ నెంబరు పనిచేయడం లేదు. దీంతో బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.