ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికురాలి మొడలో బంగారం గొలుసు చోరీ, దొంగ అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 13, 2022, 01:15 PM

చెడు వ్యసనాలకు బానిసైన విద్యార్థి దొంగతనం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అమ్మానాన్న కాలేజీ ఫీజు కట్టేందుకు ఇచ్చిన డబ్బును ఆన్‌లైన్‌ పేకాటలో పెట్టి మొత్తం పోగొట్టుకున్నాడు. ఫీజు కట్టడం ఎలాగో తెలియక చివరకు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒంగోలు స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికురాలి మొడలో బంగారం గొలుసు లాక్కొని పరుగుతీసాడు. అయితే అక్కడ విధుల్లో ఉన్న ఇరువురు హోంగార్డులు వేగంగా స్పందించారు. ధైర్యంగా వెంటపడి సుమారు రెండు వందల మీటర్లు పరుగు తీసి యువకుడిని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.....  ఆదివారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్టాండ్‌లోని 12వ నెంబరు ప్లాట్‌ఫామ్‌ వద్ద తిరుపతి వెళ్లేందుకు కృష్ణా జిల్లా పమిడి ముక్కల మండలం శ్రీరంగపురానికి చెందిన నారాయణ బాలదుర్గ దంపతులు వేచి ఉన్నారు. అదే సమయంలో సంతనూతలపాడుకు చెందిన ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి బాలదుర్గ మెడలో ఉన్న గొలుసును లాక్కొని పరుగెత్తాడు. బాధితురాలు, ప్రయాణికులు కేకలు వేయడంతో విధి నిర్వహణలో ఉన్న హోంగార్డులు డి.బాబూరావు, జి.హనుమంతరావు అప్రమత్తమయ్యారు. దొంగతనం చేసి పరిగెడుతున్న యువకుడి వెంటపడి పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న గొలుసును స్వాధీనం చేసుకొని ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు. బాలదుర్గ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com