ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమ, మంగళవారాల్లో ఖాళీలను ప్రకటించాల్సి ఉంది. దీంతో పాఠశాలల్లో యాజమాన్యాలు, కేడర్ వారీగా ఖాళీలను నిర్ధారించేందుకు విద్యాశాఖ అధికారులు కుస్తీపడుతున్నారు. బదిలీలకు అన్ని ఖాళీ లు ప్రకటిస్తే వెనుకబడిన, మారుమూల ప్రాంతాల్లోని స్కూళ్లలో పోస్టులు మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని మండలాలకు దామాషా పద్ధతిలో పోస్టులు బ్లాక్ చేయాలని బదిలీల ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా స్పౌజ్ పాయింట్లు దుర్వినియోగం కాకుండా ప్రత్యేకంగా పరిశీలన చేయాలని ఆదేశించింది.