కర్ణాటకలోని కలబురగి రైల్వే స్టేషన్ గోడలపై ఆకుపచ్చ పెయింట్ వేయడం ఆ ప్రాంతంలోని హిందూ అనుకూల సంఘాల ఆగ్రహానికి దారి తీసింది. దీనికి వ్యతిరేకంగా మంగళవారం హిందూ సంఘాల కార్యకర్తలు నిరసన ప్రదర్శన జరిపారు. ఆకుపచ్చ రంగు వల్ల కలబురిగి రైల్వే స్టేషన్ మసీదులా ఉందని.. వెంటనే ఆ రంగు తొలిగించాలని హిందూ సంఘాల కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.