నిరంతరం పొలంలో పని చేస్తూ తనకు జీవానాధారంగా ఉన్న ఎద్దులపై ఓ వ్యక్తి వినూత్నంగా ప్రేమను చూపాడు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా నంజన్ గూడు తాలూకా చిక్కహోమ్మాకి చెందిన మహేష్.. వృత్తి రీత్యా రైతు. అతనికి యోగిత అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయం కాగా సోమవారం వారి వివాహం జరిగింది. ఈ క్రమంలో తన 2 ఎద్దులను సుందరంగా అలంకరించి ఫంక్షన్ హాల్ వద్దకు తీసుకొచ్చాడు. వీటి కోసం ప్రత్యేకంగా స్టేజీని సైతం ఏర్పాటు చేశాడు. ఎద్దులపై యువకుడు చూపిన ప్రేమపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.