రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై ఉద్రిక్తతలను తగ్గించేందుకు డిసెంబర్ 14 (బుధవారం)న కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం కానున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో రాళ్లదాడి ఘటనలు చోటుచేసుకోవడంతో ఇరువురు ముఖ్యమంత్రులు ఈ అంశంపై మాటల యుద్ధానికి దిగడంతో షా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సమావేశంలో పాల్గొంటున్నట్లు ధృవీకరించారు.