భార్య మనస్సును ఎరగడం అంటే ఇదేనేమో. భర్తలు... భార్యలకు గిఫ్ట్‌లు ఇస్తుంటారు. ఖరీదైన బహుమతులు కూడా అందిస్తుంటారు. కొందరు భార్యలకు నచ్చేవే ఇచ్చి సంతోష పెడుతుంటారు. అయితే ఓ వ్యక్తి... తన భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటో తెలిస్తే.. అందరూ షాక్ అవుతారు. గాడిదను బహుమతిగా అందజేసి సర్ప్రైజ్ చేశాడు. పాకిస్థాన్‌కు చెందిన యూట్యూబర్ అజ్లాన్ షా తన భార్య వరషకు నచ్చిన బహుమతిని ఇచ్చాడు.
ఓ గాడిద పిల్లను అందించాడు. పెళ్లి రిసెప్షన్ వేదికపైనే ఇదంతా జరిగింది. వీరిద్దరి పెళ్లి జరిగిన తర్వాత బంధువులు, స్నేహితులను పిలుచుకుని రిసెప్షన్ పెట్టుకున్నారు. ఆ వేడుకలోనే పిల్ల గాడిదను తీసుకొచ్చి ఆమెకు బహుమతిగా అందజేశాడు. అది చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. కానీ వధువుకు గాడిదలంటే ఇష్టమంట. అది గుర్తించిన అజ్లాన్ షా అదే గిఫ్ట్‌గా తెచ్చి ఇచ్చాడు.