పెద్దవడుగూరు: మండలంలోని ఆవులాంపల్లి సమీపంలో ద్విచక్రవాహనం బోల్తాపడి తీవ్రంగా గాయపడిన యతిరాజు ఆచారి (35) మంగళవారం మృతిచెందినట్లు ఎస్ఐ రాజశేఖరరెడ్డి చెప్పారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెం దినట్లు చెప్పారు. పెద్దవడుగూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టుకునే ఉద్యోగిగా పనిచేసే ఇతడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.