కల్తీ మద్యం సేవించి ముగ్గురు మృతి చెందిన ఘటన బీహార్ లో జరిగింది. సారణ్ జిల్లాలోని ఛప్రా ప్రాంతంలో కల్తీ మద్యం సేవించి ముగ్గురు వ్యక్తులు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టంకు పంపారు. ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారని, మరికొంత మంది వివిధ చోట్ల చికిత్స పొందుతున్నట్లు కూడా సమాచారం అందిందని ఎస్పీ ఎస్.కుమార్ తెలిపారు.