ఇరాన్ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమీర్ నసర్ అజాదాని అనే 26 ఏళ్ల ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ కు మరణ శిక్ష విధించింది. మహిళా హక్కుల కోసం జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నాడనే కారణంతో అతడికి మరణ శిక్ష విధించింది. గాయం కారణంగా అమీర్ కొంతకాలంగా ఫుట్ బాల్ మ్యాచులు ఆడటం లేదు. అయితే సెప్టెంబర్ లో మహ్స అమిని అనే 22 ఏళ్ల యువతిని హిజాబ్ సరిగ్గా ధరించలేదన్న కారణంతో మోరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పొలీసుల కస్టడీలో ఆ యువతి అనుమానాస్పదంగా మరణించింది. దీంతో మహిళా హక్కులపై పలు సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఇది పలు చోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇద్దరు సైనికులు, ఓ గార్డ్ కూడా చనిపోయారు. ఈ ఘటనకు తానే కారణమని ఫుట్‌బాల్ ప్లేయర్ అమీర్ ఒప్పుకోవడంతో మరణశిక్ష విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.