ఓ వ్యక్తి తన మొదటి భార్యతో కలిసి రెండో భార్యను హత్య చేసేందుకు యత్నించిన ఘటన మధ్యప్రదేశ్ లోని మందసౌర్ లో జరిగింది. మాల్యాఖేడీ గ్రామంలో మోజిమ్ స్మగ్లింగ్ కేసులో జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో అతని మొదటి భార్య ప్రేమికుడితో పరారైంది. రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చిన మోజిమ్ 2015లో మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం మొదటి భార్యకు తెలియగా ఆమె మోజిమ్ వద్దకు వస్తానని పట్టుబట్టింది. దీంతో మోజిమ్ తన రెండో భార్యను చంపేందుకు ప్లాన్ చేశాడు. పాముతో కరిపించి, విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చినా ఆమె చావకపోవడంతో భయపడి ఇద్దరూ పరారయ్యారు. ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.