కల్తీ మద్యానికి బీహార్ లో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా మరో ఆరుగురు మద్యం కాటుకు బలయ్యారు. ఛాప్రా జిల్లాలోని సరన్ ప్రాంతం ఐసౌపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దోయిలా గ్రామంలో మంగళవారం ఈ విషాదం జరిగింది. కల్తీ మద్యం సేవించిన వారిలో ఐదుగురు గ్రామంలోనే ప్రాణాలు కోల్పోగా.. ఒకరు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ చనిపోయారు. మరి కొంతమంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.