గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత, శాసనసభ మాజీ స్పీకర్ కాజ రామనాథం మనవడు రఘు వివాహం ఘనంగా జరిగింది. ఈ పరిణయ మహోత్సవానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సతీసమేతంగా హాజరయ్యారు. వధూవరులు శ్వేత, రఘులను చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ఆశీర్వదించారు. నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కేశినేని కుమార్తె పెళ్లికి టీడీపీ నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు. కేశినేని శ్వేత, రఘుల నిశ్చితార్థం గత జులైలో జరిగింది. హైదరాబాదులోని హోటల్ తాజ్ కృష్ణలో నిశ్చితార్థం కూడా పెళ్లి స్థాయిలో ఘనంగా నిర్వహించారు.