సమాజాన్ని ఎదురించి కుటుంబ సహకారం లేకపోయినా లాయర్ గా ఎదిగారు తమిళనాడుకు చెందిన ట్రాన్స్ జెండర్ కన్మణి. చెన్నైకి చెందిన కన్మణి.. ఉపాధ్యాయులు, స్నేహితుల సహకారంతో పట్టు వదలకుండా కష్టపడి చదివి.. ఆ రాష్ట్ర మొదటి ట్రాన్స్ జెండర్ న్యాయవాదిగా రికార్డుకెక్కారు. ప్రభుత్వ న్యాయ కళాశాలలో చదివిన తొలి ట్రాన్స్ జెండర్ లాయర్ గా లీగల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అందుకున్నారు. సివిల్ జడ్జి కావడమే తన తదుపరి లక్ష్యమని కన్మణి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa