ఫ్రాన్స్ కు చెందిన దసో ఏవియేషన్ సంస్థతో రఫేల్ యుద్ద విమానాల కోసం భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా 36 రఫెల్ విమానాలను భారత్ కు అందించాలి. అయితే తాజాగా రఫెల్ విమానాల్లో చివరిదైన 36వ ఎయిర్ క్రాఫ్ట్ భారత్ కు చేరుకుంది. ఫ్రాన్స్ నుండి బయల్దేరిన ఈ విమానం UAEలో గాల్లోనే ఇంధనం నింపుకుంది. అనంతరం నిరంతరాయంగా ప్రయాణించి భారత్ కు చేరుకున్నట్లు భారత వాయుసేన తెలిపింది. దీంతో ఒప్పందం ప్రకారం 36 విమానాలు భారత్ కు అందాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa