రాజస్థాన్ జైపుర్ కు చెందిన ఓ యువతి చేసుకున్న వినూత్న వివాహం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. డిసెంబర్ 8న జైపుర్, గోవింద్ గఢ్ లోని నర్సింగ్ పురాకి చెందిన పూజా సింగ్(30) శ్రీకృష్ణుడ్నివివాహమాడింది. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో తన జీవితాన్ని కన్నయ్యకు అంకితమిచ్చింది. ఈ వేడుకకు సుమారు 300 మంది అతిథులు వచ్చారని.. రూ.2.50 లక్షలు ఖర్చైందని పూజాసింగ్ తెలిపింది. ఓ పూజారి ద్వారా తులసీ వివాహం గురించి తెలుసుకొని శ్రీకృష్ణుణ్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa