ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారికి సిగరెట్ల అమ్మకం బంద్!

international |  Suryaa Desk  | Published : Thu, Dec 15, 2022, 02:41 PM

న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2009 తర్వాత జన్మించిన వారికి సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా నిషేధం విధించింది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని అక్కడి పార్లమెంట్ ఆమోదించింది. ఈ నిర్ణయంతో ఆ దేశంలో కొన్నేళ్ల తర్వాత ధూమపానం శాశ్వతంగా ఆగిపోయే అవకాశం ఉంది. తర్వాతి తరం ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏ దేశమైనా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఆ దేశంలో సిగరెట్లు విక్రయించే దుకాణాల సంఖ్య కూడా తగ్గుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa