భారత యువ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ సొంత రాష్ట్రం జార్ఖండ్ తరఫున ఆడుతున్న ఇషాన్ కేరళపై సెంచరీ చేసాడు. ఈ మ్యాచ్లో కేరళ తొలి ఇన్నింగ్స్లో 475 పరుగుల భారీ స్కోరు చేసింది. మరోవైపు జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్లో 340 పరుగులు చేసింది. ఒక దశలో 114 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జార్ఖండ్ కు ఇషాన్ అండగా నిలిచాడు. 195 బంతుల్లో 9 ఫోర్లతో 132 పరుగులు చేయడంతో జార్ఖండ్ కోలుకుంది. 175 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన కేరళ గురువారం రెండో ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 60/1తో నిలిచింది.