మరో 16 నెలల్లో ఎన్నికలు రానున్నందున వైసీపీ నేతలు, కార్యకర్తలు పట్టుదలతో పనిచేయాలని సీఎం జగన్ కోరారు. జనవరి నుంచి ఎన్నికలకు వేగంగా అడుగులు వేస్తామన్నారు. ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లాలని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్య చేశారు. ప్రతి గ్రామంలో 89 శాతం ఇళ్లకు పథకాలు అందుతున్నాయని జగన్ చెప్పారు.