ఐసీడీఎస్ శాఖలో ఖాళీగా ఉన్న సీడీపీవో పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే 61 సీడీపీవో పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అంగన్వాడీలలో ఖాళీగా ఉన్న సీడీపీఓ పోస్టుల వివరాలను సీఎంకు అందించారు.