రోజ్ గార్ మేళాల కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, స్వతంత్ర సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్తగా 1.47 లక్షల మందిని నియమిస్తూ నియామక పత్రాలు అందజేశామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గురువారం రాజ్యసభలో కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో వెల్లడించారు. ఇంకా భర్తీ కాని పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. 2020-21కి నిరుద్యోగిత 4.2 శాతంగా నమోదైందని చెప్పారు.