థాయిలాండ్ యువరాణి జబ్రికిటియభా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పెంపుడు శునకాలకు శిక్షణ ఇస్తున్న ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెకు వెంటనే స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, అనంతరం హెలికాఫ్టర్ లో బ్యాంకాక్ లోని మరో ఆసుపత్రికి తరలించారు. యువరాణికి ప్రస్తుతం చికిత్స అందుతోందని, ఆరోగ్యం నిలకడగానే ఉందని థాయ్ రాయల్ ప్యాలెస్ ఓ ప్రకటన విడుదల చేసింది.