కర్ణాటకలోని బెంగుళూరులో ఓ యువతి స్కూటీని తగలబెట్టాడు ఆమె ప్రియుడు. హలసూరుకు చెందిన యువతి.. నిందితుడు విక్రమ్ తో మూడేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే, అతను మాదకద్రవ్యాల వ్యాపారంలో ఉన్నాడని తెలిసి మార్చేందుకు యత్నించింది. అయినా అతనిలో మార్పు రాకపోవడంతో అతని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో విక్రమ్ ను పోలీసులు అరెస్ట్ చేయగా.. 8 నెలల తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. తన అరెస్ట్ కు యువతే కారణమని తెలుసుకున్న నిందితుడు డిసెంబర్ 12న యువతి స్కూటీని తగలబెట్టాడు. ఈ క్రమంలో నిందితుడిని మళ్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.