ఫిఫా ప్రపంచకప్ అర్జెంటీనా సెమీఫైనల్లో క్రొయేషియాపై గెలిచి ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ముందు అర్జెంటీనాకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఫైనల్ మ్యాచ్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. సెమీఫైనల్లో క్రొయేషియాతో మ్యాచ్ లో మెస్సీ స్నాయువుకు గాయమయిందని, దీంతో గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ కు దూరంగా ఉన్నట్లు సమాచారం. అయితే మెస్సీ మాత్రమే కాకుండా మరో స్టార్ ఆటగాడు పాపు గోమెజ్ కూడా చీలమండ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ కు అతడి అందుబాటుపై కూడా సందిగ్ధత నెలకొంది.