ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాహసయాత్ర చేపట్టిన నాలుగేళ్ల బాలిక

national |  Suryaa Desk  | Published : Fri, Dec 16, 2022, 12:19 PM

ప్రతి ఏటా లక్షలమంది భక్తులు నర్మదా పరిక్రమ పేరుతో నర్మదా నది చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే రాజేశ్వరి అనే నాలుగేళ్ల చిన్నారి తల్లితండ్రులతో కలిసి ఈ అరుదైన యాత్ర చేపట్టింది. బుడిబుడి అడుగులు వేస్తూ నర్మదా నది చుట్టూ 3,500 కి.మీ ప్రదక్షిణ చేసేందుకు సిద్ధమైంది. అక్టోబరు 12న ప్రారంభమైన యాత్ర ఇంకా కొనసాగుతోంది. మహారాష్ట్ర నుండి ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి ఈ చిన్నారి రోజూ 25 కి.మీ ప్రదక్షిణ చేస్తుంది. రాళ్లూ రప్పలు, ముళ్లపొదలు దాటుకుంటూ ముందుకు సాగుతున్న ఈ చిన్నారిని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com