కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, విమానయాన టర్బైన్ ఇంధనం (ATF) పై విండ్ ఫాల్ పన్నును తగ్గించింది. దేశీయంగా ముడి చమురు ఎగుమతిపై పన్నును టన్నుకు రూ.4,900 నుంచి రూ.1,700కు తగ్గించినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ లో పేర్కొంది. ఏటీఎఫ్‌పై పన్ను లీటరుకు రూ.5 నుంచి రూ.1.5 కి తగ్గింది.