లేపాక్షి మండలం కంచి సముద్రం చిన్న చెరువు, పెద్ద చెరువులలో చేపల వేలంపాటను పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గంగలక్ష్మమ్మ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. వేలందారులు అధిక సంఖ్యలో పాల్గొని చిన్న చెరువును రూ. 78వేలకు, పెద్దచెరువును 38వేలకు వేలం విక్రయించినట్లు తెలిపారు. దీంతో పంచాయతీకి రూ. 109లక్షలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. చిన్న చెరువు మొదటిసారిగా వేలం నిర్వహించడంతో అధిక మొత్తంలో ఆదాయం వచ్చినట్లు తెలి పారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.