ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఎకో టెంట్ రిసార్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో బీచ్ లు, కొండ ప్రాంతాల్లో 5 ఎకో టెంట్ రిసార్టులను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని పెదగంజాం-నిజాంపట్నం బీచ్ కారిడార్, తుపిలిపాలెం, ముత్యాలంపాలెం, అందాలపల్లె బీచ్, మల్లయ్య కొండపై టెంట్ రిసార్టులను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ఒక్కో రిసార్టులో 20 గదులతో పాటు రెస్టారెంట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.