అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు చెత్తపన్ను విధిస్తే సీపీఎం ఆధ్వర్యంలో ఎక్కడిక్కడ ఆందోళనలు చేపడతామని సీపీఎం నగర 1వ కమిటీ కార్యదర్శి రామిరెడ్డి పేర్కొన్నారు. చెత్తపన్ను విధించాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ గురువారం సీపీఎం ఆధ్వర్యంలో నగరపాలకసంస్థ కార్యాలయ ఆవరణలో ధర్నా నిర్వహించారు. అక్కడికి వచ్చిన నగరపాలకసంస్థ కమిషనర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాలమేరకే చెత్తమీద చార్జీ వసూలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రకాష్, వలి, వెంకటేష్, ప్రసాద్, రాజు, రజకసంఘం నాయకులు నాగభూషణం, రామాంజి, నిజాం, శివ, నాగరాజు, వన్నూరప్ప పాల్గొన్నారు.